ఇది నిజమే!

Andhrawatch
1 Min Read

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అటు టాలీవుడ్‌ అభిమానులతో పాటు మహేష్‌ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఈ సినిమా పై చాలా రూమర్స్ వినపడుతున్నాయి. అయితే తాజాగా మరో కొత్త సినిమాకి సంబంధించి మహేష్ పాత్ర పై ఓ క్రేజీ గాసిప్ బాగా వైరల్ గా మారింది.

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాలో మహేష్, శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడని మొన్నటి నుంచి వార్తలు వినపడుతున్నాయి.  కానీ, ఈ వార్తకు సంబంధించి తాజా సమాచారం ప్రకారం.. మహేష్ ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాలో ఎలాంటి పాత్రలో యాక్ట్‌ చేయడం లేదు.

శ్రీకృష్ణుడి పాత్రలో కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడని వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. అలాంటి ప్లానింగ్ ఏమి లేదు. ఇక మహేష్ – రాజమౌళి సినిమా విషయానికి వస్తే.. భారీ అంచనాలున్న ఈ మూవీ ప్రాజెక్టు 2025 లో ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పై రాజమౌళి టీమ్ వర్క్ చేస్తోంది.

Share This Article