తేజ నెక్ట్స్ మూవీ టైటిల్‌ ఇదే!

Saturday, January 11, 2025

టాలీవుడ్ డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత మళ్లీ హిట్ అందుకోలేదు. దీంతో ఆయన ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని కొత్త కథలను తేజ వింటున్నారని సమాచారం. ఆయన తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తేజకు ఓ కథ నచ్చిందని, ఇది తన కుమారుడి ఎంట్రీకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన అనుకుంటున్నాడంట. ఇక ఈ సినిమాకు ‘హనుమంతు’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేయాలని ఆయన అనుకుంటున్నారంట. ఇదొక ఫాంటెసీ కథగా ఉండనుందని టాక్.

ఈ సినిమాను కూడా లవ్ జోనర్‌లో తెరకెక్కించాలని తేజ చూస్తున్నాడట. ఈ సినిమా కోసం తేజ హోంవర్క్ స్టార్ట్ చేశారని, తన కుమారుడిని కరెక్ట్‌ సమయంలో లాంచ్ చేస్తారని ఫిలిం సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే తేజ వీటిపై క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles