మోనార్క్ జగన్ అహంకారానికి ఇది మరొక ప్రతీక!

Thursday, January 2, 2025

వైఎస్ జగన్ ఎంత అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారో తెలుసుకోవడానికి ఇది మరొక ఉదాహరణ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ల జాబితాను తాజాగా సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు. సాధారణంగా రాజకీయ పార్టీలు అనుసరించే ధోరణులకు భిన్నంగా సామాన్య వ్యక్తులను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేస్తూ పార్టీ జాబితాను రూపొందించింది. ఈజాబితాను ఎన్నికల సంఘానికి అందించారు. వీళ్లందరూ కూడా జగన్ మీద తమ అభిమానం ప్రదర్శిస్తూనే.. మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలో.. రాష్ట్ర ప్రజలకు వివరిస్తారని సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రకటించారు.
సాధారణంగా పార్టీలు నాయకుల కరిష్మా మీద నడుస్తుంటాయి. జాతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులు, అలాంటి గుర్తింపు ఉన్నప్పటికీ  క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నవారు, సెలబ్రిటీలు, మేధావులు ఇలాంటి వారు స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. ప్రాంతీయ పార్టీలు అయితే.. సాధారణంగా వ్యక్తిస్వామ్యంగా, వ్యక్తి కేంద్రంగా ఉండే పార్టీలు అయి ఉంటాయి. వారికి నచ్చిన సీనియర్లు, సినిమావాళ్లు ఇతర రంగాల ప్రముఖులనుకూడా స్టార్ క్యాంపెయినర్లుగా  వాడుతుంటారు.
అయితే జగన్మోహన్ రెడ్డి రూటేసెపరేటు. ఆయన తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన పథకాల ద్వారా లబ్ధి పొందిన సాధారణ ఓటర్లను స్టార్ క్యాంపెయినర్లుగా ఎంపిక చేశారు. దీని ద్వారా తాను కొత్త ట్రెండ్ సృష్టించానని ఆయన టముకు వేసుకుంటున్నారు. అయితే మానసిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్న దానిని బట్టి.. ఇది జగన్ లోని అహంకారానికి ప్రతీక అని.. మోనార్క్ వైఖరికి నిదర్శనం అని అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది తన ఒక్కడి మీదనే నడుస్తున్నదని, ఆపార్టీ పొరబాట్న గెలిచినా కూడా.. ఆ గెలుపుకు సంబంధించిన క్రెడిటల్ ఎవ్వరికీ వాటా ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని అందుకే ఆయన ఎంతో మంది పార్టీలోని సీనియర్లు , సెలబ్రిటీలు ప్రస్తుతం ఎన్నికల గోదాలో లేకుండా ఖాళీగానే ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా ఇవ్వలేదని అంటున్నారు. వైసీపీ అంటేనే తానొక్కడే తప్ప మరొక్కరు ఎవ్వరూ లేరనే ఆయన అహంకార వైఖరికి ఇది నిదర్శనం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles