ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇపుడు అనౌన్స్ అయ్యిన భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో మొట్ట మొదటిగా చేస్తున్న ఈ సినిమా అనౌన్సమెంట్ వీడియో ఊహించని రీతిలో అందించడంతో టోటల్ పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైట్ అయ్యారు. ఇక షూటింగ్ ఇవన్నీ ఎపుడు మొదలవుతాయి అనేవి పక్కన పెడితే ఈ చిత్రం కోసం మరో ఇంట్రెస్టింగ్ అంశం బయటకి వచ్చింది.
అట్లీ ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇపుడు బన్నీతో చేస్తున్న సినిమానే తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ రివీల్ చేసాడు. తన డ్రీం ప్రాజెక్ట్ కి లైఫ్ వచ్చే విధంగా తోడ్పడిన వారికి థాంక్స్ చెప్పి అసలు విషయం రివీల్ చేసాడు. మరి తన డ్రీం ప్రాజెక్ట్ అని చెబుతున్న ఈ సినిమాని అట్లీ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో చూడాలి మరి.