వారిపై డబల్ లేయర్ నిఘా అవసరం!

Wednesday, December 18, 2024

పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ప్రచారాల హోరు ఉండాల్సిందే తప్ప.. అభ్యర్థులు క్రియాశీలంగా అసలైన కార్యక్షేత్రంలోకి దిగే సమయం ఆసన్నం అయింది. క్రియాశీల కార్యక్షేత్రం అంటే మరేమీ కాదు. ఓట్ల కొనుగోలుకోసం ప్రజలకు డబ్బు పంచడం. పోలీసులు కూడా మరింతగా యాక్టివేట్ కావాల్సిన సందర్భం ఇది. నిఘాను పెంచితే ఎక్కడికక్కడ డబ్బు సంచులు బయటపడే అవకాశం ఉంది. అలాగే అభ్యర్థులు కూడా అలర్ట్గ్ గా ఉంటారు. పోలీసుల కళ్లు గప్పి ఓటర్లకు డబ్బు పంచడానికి ఇప్పటికే వారి ఏర్పాట్లు వారు చేసుకుని ఉంటారు. అయితే ఏపీలో డబ్బుపంపిణీని సమర్థంగా అరికట్టాలంటే వాలంటీర్ల మీద పక్కాగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్మోహన రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చిన నాటినుంచి వారిద్వారా క్షేత్రస్థాయి నుంచి అనుచితమైన రీతిలో లబ్ధి పొందడానికే ఆలోచిస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలోని పథకాల లబ్ధిదారులైన ముసలివాళ్లు, వితంతువులు, వికలాంగులను జగన్ కు అనుకూలంగా మభ్యపెడుతూ ఉండడం. వారి వద్ద నిత్యం జగన్ ను పొగుడుతూ ఉండడం మాత్రమే కాదు.. ప్రజల యొక్క వ్యక్తిగత డేటాను కూడా సేకరించి తమ సర్వర్లలో నిక్షిప్తం చేసుకున్నారు. అలాంటి అనేక అక్రమాలు కూడా వారిద్వారా చేయించాలనుకున్నారు గనుకనే.. గరిష్టంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమిస్తూ వచ్చారు.

ఎన్నికల సమయంలో వారి ద్వారానే ఓటర్లకు డబ్బు పంచాలనేది తొలినుంచి వైసీపీ ప్లాన్. ఇప్పుడు అదే అమలవుతోంది. దాదాపు 90 వేల మందితో ఏకంగా రాజీనామాలే చేయించి.. కొన్నాళ్లుగా తమ వెంట తిప్పుకుంటూ లబ్ధిదారులను మభ్యపెడుతూ క్షేత్రస్థాయి ప్రచారానికి వాడుకుంటున్న వైసీపీ అభ్యర్థులు, వారితో పాటు విధుల్లో ఉన్న వాలంటీర్లను కూడా వాడుకుంటూ వారిద్వారా డబ్బు పంచాలని ప్లాన్ చేస్తున్నారు. వారి వద్దకు డబ్బు కట్టలు చేరుకుంటున్నాయి.

చంద్రబాబునాయుడు తమ కష్టానికి జీతం రూ.పదివేలకు పెంచిన తరువాత.. కొందరు వాలంటీర్లు మాత్రం వైసీపీ వారి ఒత్తిడికి తలొగ్గడం లేదు. మిగిలిన వారిద్వారా డబ్బు పంచే వ్యవహారం జరుగుతోంది. వాలంటీర్ల మీద, ప్రత్యేకించి మాజీ వాలంటీర్ల మీద  డబల్ లేయర్ నిఘా ఉండాల్సిందేనని.. లేకపోతే డబ్బు పంపిణీని అరికట్టలేం అని తెలుగుదేశం నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాలంటీర్లకు చెక్ పెట్టడంలో విఫలం అయిన ఈసీ.. ఈ నిఘా విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. పోలీసులు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీకి కొమ్ము కాస్తుండగా.. వారి సహకారంతోనే వాలంటీర్ల ద్వారా పంపిణీ జరుగుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles