కొత్త చట్టాలు చేసేప్పుడు ఈ జాగ్రత్తలు అవసరం!

Thursday, December 4, 2025

సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ సైకోలు విచ్చలవిడిగా రెచ్చిపోతూ.. ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారనే సంగతి అందరికీ తెలుసు. అయితే ఇలాంటి వారిని కట్టడి చేయడానికి ‘సోషల్ అట్మాస్పియర్’ సవ్యంగా ఉండేలా.. ప్రజలను తప్పుదారి పట్టించకుండా చూసేలా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో చెలరేగుతున్న వారిని కట్టడి చేయడానికి కొత్త చట్టాలు తీసుకురావడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా చంద్రబాబునాయుడు ఏర్పాటుచేశారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నట్టుగా.. ఈ ఏర్పాటు జరిగిన నాటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెగ గింజుకుంటున్నారు. ఇదంతా కేంద్రానికి సంబంధించిన వ్యవహారం.. ఇలాంటి చట్టాలు తీసుకురావాలనుకోవడం ద్వారా.. రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ గోల చేస్తున్నారు. కానీ.. నిజంగా సోషల్ సైకోలను కట్టడి చేయాలంటే.. అనేక కోణాల్లో ఈ సమస్యలను పరిశీలించాల్స ఉంటుంది.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు అంటే కేవలం అనుచిత వ్యాఖ్యలు, అసభ్య మాటలు మాత్రమే అనుకుంటే పొరబాటు. ఇప్పటికే అనేక చట్టాల కింద అలాంటి పోస్టులను కట్టడి చేయడానికి పోలీసులు కేసులు పెడుతున్నారు. మరింత పటిష్టమైన చట్టాలరూపకల్పనకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో.. పైకి అంత ప్రమాదకరంగా కనిపించని మరో మార్గంలో కూడా విషప్రచారాలు జరుగుతున్నాయి. చట్టాలరూపకల్పనకోసం ఉద్దేశించిన ఉపసంఘం ఇలాంటి వాటి విషయంలో కూడా కాస్త లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంనుంచి ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి ఉన్న డీఏల సంగతి గమనిద్దాం. ఇలాంటి విషయంలో ఒక రకమైన తప్పుడు ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇదిగో ప్రభుత్వం మూడు డీఏలు ఇవ్వడానికి జీవో రెడీ చేస్తున్నదంటూ సోషల్ మీడియాలో ఒక తప్పుడుప్రచారం మొదలవుతుంది. ఉద్యోగులు ఆశపడతారు. సహజంగా అది వైరల్ అవుతుంది. ఈ కేబినెట్ భేటీలోనే నిర్ణయం అని కూడాప్రచారం జరుగుతుంది. ఆ భేటీకోసం ఉద్యోగులు ఎదురుచూస్తారు. కానీ ప్రభుత్వం ఎజెండాలో అది ఉండదు. ఆ భేటీ ముగిసిన తర్వాత.. ఉద్యోగులకు ఆశాభంగం అవుతుంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి చెందుతారు. .. ఇదే వ్యూహాన్ని వైసీపీ దళాలు అనుసరిస్తున్నాయి. అబద్ధపు ఆశలను వారే పుట్టించి, వారే భంగపరచి.. ప్రభుత్వంమీద ద్వేషం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టే సైకోలను కూడా చట్టాలపరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. సోషల్ మీడియాలో అశాంతికర దుర్మార్గపు వాతావరణం పెరిగిపోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అసభ్య, అనుచిత వ్యాఖ్యల్లా కనిపించకపోయినా.. సమాజాన్ని విచ్చిన్నం చేసే ఇలాంటి అబద్ధాల ప్రచారాలు పుట్టించే వారిపై కూడా చర్యలుండేలా కొత్త చట్టాలు రావాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles