జగన్మోహన్ రెడ్డి వైఖరి.. గోబెల్స్ ను తలదన్నేలా ఉంటోంది. నిజానికి గోబెల్స్ కు కొత్త పాఠాలు నేర్పించగలిగేలా జగన్ తీరు ప్రస్తుత రాజకీయాల్లో కొత్త అధ్యాయాలను
సృష్టిస్తోంది. ‘‘ఒక అబద్ధం చెప్పు. చెప్పేదేదో చాలా ఘనమైన అబద్ధమే చెప్పు. చెప్పేసిన అబద్ధానికి కట్టుబడి ఉండు. ఆ అబద్ధాన్ని పదేపదే చెబుతూ ఉండు.. అదే అబద్ధాన్ని పదిమందితో చెప్పిస్తూ ఉండు.. పదిచోట్ల చెబుతూ బతుకు..’’ అనేది జగన్ తాజా రాజకీయ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారమే ఆయన మనుగడ సాగిస్తున్నారు. ఉదాహరణలు గమనిద్దాం. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మీద ఆయన వేస్తున్న నిందలకు కనీసం ఆయన వద్దనైనా సమాధానాలు ఉన్నాయో లేదో కొన్ని ప్రశ్నలు అడిగిచూద్దాం.
జగన్ : చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 35 రాజకీయ హత్యలు జరిగాయి.
ప్రశ్న : జగనన్నా.. రౌడీషీటరు రషీద్ హత్యకు గురైతే ఆ కుటుంబాన్ని మాత్రం చాలా ప్రేమగా వెళ్లి పలకరించావు. మిగిలిన 35 మంది ఏం పాపం చేశారు? ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా నువ్వు చెబుతున్న ప్రకారం చచ్చిపోయిన 35 మందిలో ఎన్ని కుటుంబాలను పరామర్శించావు. లేదా, ఎందుకు పరామర్శించలేదు? అసలు ఓ గంట టైం తీసుకుని అయినా.. 35 హత్యలు ఎక్కడెక్కడ జరిగాయో.. ఎవరెవరో కాస్త జాబితా చెప్పగల స్థితిలో ఉన్నావా జగనన్నా? అన్నిచోట్లా పోలీసుకేసులు పెట్టారా? ఆ కేసుల వివరాలు కూడా చెప్పగలవా?
జగన్ : వందల ఇళ్లను ధ్వంసం చేశారు.
ప్రశ్న : తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి కాస్త దూకుడు చూపించినది నిజం. ఆ ఒక్కటి పక్కన పెడితే.. వందల ఇళ్లు కూల్చారంటున్నావు కదా.. కనీం ఇరవై కూల్చిన ఇళ్ల దగ్గర.. నీ నెట్ వర్క్ వారితో ఏకకాలంలో లైవ్ లో చూపించి, వాటిని చంద్రసర్కారు కూల్చేసిందని.. ప్రజలను నమ్మించగల స్థితిలో ఉన్నావా జగనన్నా!
జగన్ : ప్రభుత్వ ప్రెవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు.
ప్రశ్న : నీ ఉద్దేశంలో ప్రభుత్వ ఆస్తులు అంటే ఏమిటి జగనన్నా? నీ బొమ్మలు అచ్చొత్తించిన ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు లాంటివా? అవి ధ్వంసమయ్యాయంటే నీ బొమ్మ పుణ్యమే కదా జగనన్నా.. ఆ పాపం వారి మీదకు నెడతావెందుకు?
జగన్ : వెయ్యికి పైగా అక్రమ కేసులు పెట్టారు!
ప్రశ్న : జగనన్నా! అతిశయోక్తులకు కూడా ఒక హద్దుండాలి! మరీ అలా చెలరేగిపోతే ఎలా? చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన 12వ తేదీ తరువాత వెయ్యి కేసులు నమోదై ఉన్నట్టుగా లెక్క రాయగలిగితే.. మీ కరపత్రికలో ప్రచురించగలిగితే.. మీ వెంట మేమందరం చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పోరాడడానికి వస్తాం.. చూపించగలరా?
జగన్ కేవలం అబద్ధాల మీద బతికేద్దాం అని అనుకుంటున్నారు. దానికి నిదర్శనమే ఆయన మాట్లాడుతున్న మాటలు అని జనం అనుకుంటున్నారు.