మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ప్రవక్త అవతారం ఎత్తుతున్నారు. ప్రవచనాలు చెబుతున్నారు. జిల్లాల్లో తిరిగి సువార్త కూటములు నిర్వహిస్తున్నారు. సువార్త కూటములకు తరలించినట్టుగానే కిరాయి మూకలను తరలించి.. వారి ఎదుట ఆయన శ్రీరంగ నీతులు చెబుతున్నారు. ఇంతకూ జగన్ చేస్తున్న తాజా ప్రవచనాల సారాంశం ఏమిటో తెలుసా? ‘ఏది విత్తితే అదే పండుతుందట!’ ఈ మాత్రం ఎవరికి తెలియదు.. అని నవ్వుకుంటున్నారా? జగన్ మాత్రం ఎవ్వరికరీ తెలియదు.. ఈ పరమ సత్యాన్ని తాను మాత్రమే ప్రపంచానికి తెలియజెప్పాలి.. అనే నమ్మకంతోనవే ప్రవచిస్తున్నారు. నెల్లూరులో బలప్రదర్శన యాత్ర నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి.. ‘మీరు ఏదైతే విత్తుతారో అదే రేపు పండుతుంది’ అని అక్కడినుంచి బెదిరించారు. కానీ ఇప్పుడు ప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. ‘ఏమో గత అయిదేళ్ల కాలంలో జగన్ విత్తినదే ఇప్పుడు పండుతున్నదేమో’ అని!
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక్క చాన్స్ ఇస్తే.. ఆయన ఈ రాష్ట్రానికి విధ్వంసం అంటే ఏంటో రుచిచూపించారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం అంటే ఏంటో రుచిచూపించారు. రాజకీయ ప్రత్యర్థుల పట్ల తన ప్రభుత్వ వ్యవస్థలను ఎంత దుర్మార్గంగా అస్త్రాలుగా ప్రయోగించవచ్చునో ఆయన నిరూపించారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు, వ్యాపార ప్రత్యర్థులను కూడా సర్వనాశం చేయడానికి ఆయన తన అధికారాన్ని వాడుకోవాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మీద రకరకాల కేసులు బనాయించి ఎన్ని రకాలుగా వేధించారో ప్రపంచానికి తెలుసు. అచ్చెన్నాయుడును అరెస్టు చేసి.. ఆపరేషన్ చేయించుకున్న పుండు పచ్చిగానే ఉణ్న వ్యక్తిని కారులో కొన్ని వందల కిలోమీటర్లు తరలించి.. గుంటూరుకు తీసుకువచ్చిన చరిత్ర ఆయన మర్చిపోతే ఎలా.?
చంద్రబాబునాయుడు మీద కేసులు బనాయించి.. ఆయన ప్రజల మధ్య టూర్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ పోలీసులతోఆయన నిద్రిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టి అరెస్టు చేయాడానికిన చేసిన ప్రయత్నం మరచిపోతే ఎలా? చంద్రబాబును అరెస్టు చేసి.. రకరకాల పల్లెదారుల్లో తిప్పుతూ సాయంత్రానికి గుంటూరు తీసుకువెళ్లి హింసించిన వైనం మొత్తం మరచిపోతే ఎలా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశానికి చెందిన నాయకులు అయితే చాలు.. వారి ఇళ్ల మీద శనివారం అర్ధరాత్రి వేళ్లలో జేసీబీలను పంపించి అడ్డగోలుగా కూలగొట్టించిన దుర్మార్గాలను ఆయన మరచిపోతే ఎలా? అని ప్రజలు అడుగుతున్నారు.
ఆ అయిదేళ్ల పదవీకాలంలో జగన్ విత్తిన విధ్వంసపు హింసాత్మక విత్తనాలే ఇప్పుడు పండుతున్నాయని ఆయన అనుకోవచ్చు కదా? అనేది ప్రజల వాదన. తాను తీర్చిన బాటలోనే ఇప్పటి ప్రభుత్వం ఉన్నదని అనుకోవచ్చు కదా అని ప్రజలు అంటున్నారు.
నిజానికి వాస్తవం మరో విధంగా ఉంది. అయిదేళ్ల పాలన కాలంలో జగన్ విత్తిన విత్తులను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కలుపు మొక్కల లాగా పీకి పక్కన పారేసింది. అలా కాకపోతే.. ఆ విత్తులే ఎదిగి ఇప్పుడు పంట దిగుబడి ఇస్తూ ఉంటే.. జగన్మోహన్ రెడ్డి ఈపాటికి ఏడాదిగా జైలుశిక్ష అనుభవిస్తూ ఉండేవారు అని కూడా పలువురు అనుకుంటున్నారు.
