అప్పుడలా.. ఇప్పుడిలా.. జగన్ దళాలది రెండునాల్కల ధోరణే!

Thursday, December 4, 2025

రాష్ట్రంలో నకిలీ మద్యం తయారవుతున్న దందాలు వెలుగు చూశాయి. ఇలాంటి అక్రమాలు సాగించే విషయంలో పార్టీ తారతమ్యాలేమీ ఉండవు. ఏ పార్టీలో ఉన్న వారైనా సరే.. ఒక అక్రమానికి పాల్పడడం ద్వారా అడ్డదారిలో సొమ్ములుచేసుకోవచ్చునని భావిస్తే.. ఆదందాలో మునిగి తేలుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం తయారీ దందా విషయంలో కూడా.. తెలుగుదేశం తో అనుబంధం ఉన్న వారి పాత్ర వెలుగులోకి వచ్చింది. వారి మీద ఆ పార్టీ సస్పెండ్ చేయడం ద్వారా చర్యలు తీసుకుంది. విచారణలు సవ్యంగా సాగేలా అవకాశం కల్పించింది. ఇదే దందాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా పాత్ర ఉన్నట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. కానీ.. వారి మీద ఆ పార్టీ కనీస మాత్రంగా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. పైగా తెలుగుదేశాన్నే ఏకపక్షంగా నిందించడంలో వారు తరించిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. గతంలో ఒక వ్యవహారంలో ఒక తీరుగా.. ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు గురించి చర్చించుకోవాలి.

తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో వరుస చోరీలు జరిగాయి. దొంగను పట్టుకున్నారు. అతడిమీద కేసు నడిపి శిక్షలు పడేలా చేసి, చోరీ మొత్తాన్ని రికవరీ చేయడం కాకుండా.. బోర్డు విచ్చలవిడిగా నిర్ణయం తీసుకుని.. అతడితో ఒక ఆస్తిని టీటీడీకి రాయించుకుని దాంతో కేసును వెనక్కు తీసేసుకున్నారు. ఈ దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇంత దుర్మార్గంగా చేశారేంటి బాబులూ.. అనడిగితే.. మేం చాలా మంచి వాళ్లం.. ఎప్పటినుంచో జరుగుతున్న దొంగతనాన్ని మా ప్రభుత్వ హయాంలోనే పట్టుకున్నాం.. అంటూ భూమన కరుణాకర రెడ్డి.. తన నయగారపు వచనాలతో సమర్థించుకున్నారు. నిందితుడైన దొంగ ఆస్తులను తమ పార్టీ నాయకులబినామీల పేర్లతో రాయించుకున్న వైనం కప్పెట్టేశారు. అంతకు మించి తప్పు చేసిన వాడి మీద వారు తీసుకున్న చర్యలేమీ లేనేలేదు.

ఇప్పుడు తెలుగుదేశం పాలనలో నకిలీ మద్యం దందా వెలుగుచూసింది. ఈ దందా రెండున్నరేళ్లకు పైగా జరుగుతూనే ఉన్నట్టుగా కూడా బయటకు వచ్చింది. అంటే వైసీపీ కాలంలోనే మొదలైందన్న మాట. నిందితులు.. తెలుగుదేశం గెలుస్తుందని ముందే గెస్ కొట్టి.. ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరారు. అయినా సరే.. వారి అక్రమాలు వెలుగుచూసిన తర్వాత.. తెలుగుదేశం శషబిషలకు పోలేదు. వారిని పార్టీనుంచి సస్పెండ్ చేసి చర్యలు తీసుకుంటోంది. వారి మీద పోలీసుకేసులు నడుస్తున్నాయి,. ఎప్పటినుంచో జరుగుతున్న దందాను తెలుగుదేశం పాలనలోనే కదా పట్టుకున్నారు. అభినందించాల్సింది పోయి.. వారిని నిందించడం ఎలా సబబు? అనేది ప్రజల మాట.
వైసీపీ నాయకులు.. అప్పుడొక రకంగా, ఇప్పుడొక రకంగా మాట్లాడుతూ ఉంటే.. వారి అవకాశ వాద ధోరణులను ప్రజలు అసహ్యించుకుంటారని తెలుసుకోవాలి. తమ పార్టీ పాలనలో, సొంత పార్టీ నాయకులు హత్యలు చేసినా డోర్ డెలివరీలు చేసినా.. పార్టీ పరంగా కించిత్తు చర్య తీసుకోని వైసీపీ నాయకులకు.. సస్పెన్షన్ తో వేటువేసిన తెలుగుదేశాన్ని విమర్శించే హక్కులేదని పలువురు అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles