వాళ్ల కథ శిశుపాలుడిలా ముగుస్తుంది.. అంతే!

Thursday, December 4, 2025

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా భావించే వ్యక్తి. వాటి తర్వాత పార్టీ ప్రయోజనాలు తనకు ముఖ్యం అని అనుకుంటారు. వీటికి హాని జరిగేలా ఏ ఒక్కరు వ్యవహరించినా ఆయన ఉపేక్షించరు.  సొంత పార్టీ ఎమ్మెల్యేలే అయినప్పటికీ.. ఎవరు ఎలా పనిచేస్తున్నారో గమనించడానికి నిత్యం నిఘానేత్రం తెరచి ఉంచే చంద్రబాబునాయుడు.. ఎవరెవరు గాడితప్పుతున్నారో.. తెలుసుకుంటూనే ఉంటారు. అంతమాత్రాన.. కత్తిదూసి అందరిపై వేటు వేస్తారని కాదు. అలాగని ఎవరి మానాన వారిని వదిలేస్తారనీ కాదు. గాడితప్పుతున్న వారికి హెచ్చరికలతో కూడిన ఒక వ్యవధి ఇస్తారు. అప్పటికీ దార్లోకి రాకుంటే మాత్రం ఊరుకోరు. అచ్చంగా శిశుపాలుడి నూరుతప్పుల వరకు పట్టించుకోను అని చెప్పి.. ఆ నూరూ పూర్తికాగానే.. శిరసును ఖండించిన కృష్ణుడిలాగా అన్నమాట. ఇప్పుడు ఆయన హెచ్చరికలు అలాగే ధ్వనిస్తున్నాయి. ఇప్పటికే హెచ్చరికలు జారీచేసిన చంద్రబాబు.. ఒకటిరెండు సార్లు తర్వాత ఇక మాట్లాడడాలు ఉండవ్ అని సంకేతాలు ఇస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో ఇటీవలి కాలంలో పలువురు ఎమ్మెల్యేల వ్యవహార సరళి పార్టీకి తలనొప్పులు తెస్తున్న సంగతి అందరికీ తెలుసు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారమే గాడితప్పుతుండగా.. కొన్ని చోట్ల స్థానికంగా ఉండే పార్టీ ముఠాల విభేదాలు, ఇతర పార్టీలతో ఉండే తగాదాల వలన జరిగే కుట్రలు వారికి నెగటివ్ గా పనిచేస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో బాగా రచ్చకెక్కిన వ్యవహారాలు ఓ నాలుగైదు వరకు ఉన్నాయి. మహిళలతో అసభ్య ఫోన్ కాల్స్ మాట్లాడడం, ఎన్టీఆర్ పై వ్యాఖ్యలు, పెరోల్ కు ఉత్తరాలు, భూకబ్జాలు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే.. నిజానికి పత్రికలకు తెలియకపోవచ్చుగానీ.. చంద్రబాబునాయుడు దృష్టిలో ఇలా గాడితప్పుతున్న ఎమ్మెల్యేలు 35 మంది వరకు ఉన్నారట. ఇప్పటిదాకా 35 మందిని విడివిడిగా పిలిపించి మాట్లాడినట్టు చంద్రబాబు చెబుతున్నారు. సీనియర్లకు పార్టీ క్రమశిక్షణ గురించి తెలుసు గనుక.. వారు పద్ధతిగానే ఉంటున్నారని, కొత్త ఎమ్మెల్యేలే గాడితప్పుతున్నారని సీఎం అంటున్నారు. ఇలాంటివారికి ఒకటికి రెండుసార్ల హెచ్చరిస్తానని, అప్పటికీ దారిలోకి రాకుంటే ఇక కఠిన చర్యలు తప్పవని అంటున్నారు. పార్టీనుంచి ఎమ్మెల్యే ఉండగా.. అదే నియోజకవర్గంలో ఇక ఇన్చార్జిని నియమిస్తే చాలు.. సదరు ఎమ్మెల్యే పరువు గంగలో కలుస్తుందని అనుకోవచ్చు. శిశుపాలుడి సంగతి తేల్చిన కృష్ణుడి లాగా.. తప్పుదారి పడుతున్న కొత్త ఎమ్మెల్యేలకు చంద్రబాబు చెక్ పెట్టకుండా ఉండాలంటే.. వారు ముందే మేలుకోవడం మంచిది అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అలా మారకపోతే.. చంద్రబాబు నచ్చజెప్పడాన్ని, సౌమ్యాన్ని మాత్రమే చూడడం తెలిసిన కొత్త ఎమ్మెల్యేలకు ఆయన ఆగ్రహం కూడా తెలిసివస్తుందని పార్టీ వర్గాలే అంటున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles