ఉర్సాపై విషప్రచారం జగన్ కుటిలత్వానికి ప్రతీక

Tuesday, December 9, 2025

విశాఖపట్టణం నగరాన్ని తాను మాటలతో వంచించినట్టే.. అందరూ వంచించాలి తప్ప.. నిర్మాణాత్మక అభివృద్ధి పనులతో అక్కడకు ప్రాజెక్టులు తీసుకువస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కన్ను కుడుతున్నదేమో అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. దాదాపు అయిదున్నర వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకువచ్చిన ఉర్సా కంపెనీకి.. ప్రభుత్వం రాయితీ మీద స్థలాలు కేటాయిస్తుండగా.. జగన్ సర్కారు ఈ ప్రాజెక్టు మీద విషప్రచారాన్ని సాగిస్తున్నది. అబద్ధాలు అసత్యాలతో ప్రజల్లో అపోహలు సృష్టిస్తోంది.

అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అని సామెత! మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అలాగే కనిపిస్తోంది. ఆయన పాలనకాలంలో ఒక్క పరిశ్రమను గానీ, పెట్టుబడులు పెట్టి ఉపాధులు కల్పించగల సంస్థను కానీ రాష్ట్రానికి తీసుకురావడం ఆయనకు చేతకాలేదు గానీ.. విశాల దృక్పథంతో వందల మందికి ఉపాధులు కల్పించే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు మోకాలడ్డడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న సంస్థలపై తప్పుడు ప్రచారాలతో దుర్మార్గపు ప్రచారానికి దిగజారుతున్నారు.
దోచుకున్నదంతా దాచుకోవడానికి షెల్ కంపెనీలను సృష్టించి.. ఆ ముసుగులో లక్షల కోట్లు వెనకేయడం బాగా అలవాటు అయిన జగన్మోహన్ రెడ్డి నిర్దిష్టమైన కార్యచరణ, స్పష్టమైన కార్యకలాపాలతో ముందుకు వస్తున్న సంస్థల మీద ప్రజల్లో అనుమానాలు పుట్టించడానికి కుటిల యత్నాలు చేస్తున్నారు.
ఉర్సా సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగువారి ఆధ్వర్యంలో నడిచే సంస్థ. స్వదేశంలో యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో కార్యకలాపాలు విస్తరించాలని అనుకున్నప్పుడు.. ఎన్నో రాష్ట్రాలు వారిని ఆహ్వానించాయి.

అయితే తెలుగు రాష్ట్రాల మీది మమకారంతో తెలంగాణలోని రేవంత్ సర్కారుతోను, ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంతోను ఒప్పందాలు చేసుకున్నారు. హైదరాబాదులో వంద ఎండబ్ల్యు  ఏఐ డేటా హబ్ సెంటరు నెలకొల్పేందుకు ఉర్సా కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఏపీలో విశాఖలో కూడా అలాంటి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే, ఏపీకి సంస్థలు రావడం, యువతకు ఉపాధి ఏర్పడడం అంటే కన్నుకుట్టే జగన్మోహన్ రెడ్డి.. కుటిల ప్రచారం చేస్తున్నారు.

రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా.. సిమెంటు ఫ్యాక్టరీలు, పత్రికలు, మీడియా సంస్థలు నెలకొల్పే కుట్ర తెలివితేటలు లేని తమవంటి నిజాయితీగల సంస్థ మీద జగన్మోహన్ రెడ్డి విషం కక్కడం, తమ మీడియా ద్వారా దుష్ప్రచారం సాగించడం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం అని ఉర్సా సంస్థ ప్రతినిధులు అంటున్నారు. నిజానికి ఉర్సా సంస్థ రూ.5728 కోట్ల పెట్టుబడితో విశాఖలో ఏఐ డేటా సెంటరును ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. అమెరికాలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా సేవలందిస్తున్న ట్రాక్ రికార్డుతో వారు తమ సేవలను సొంత తెలుగు ప్రాంతానికి విస్తరిస్తున్నారు.

కేవలం మంచి కంపెనీలు రాష్ట్రానికి రాకూడదు, ఇక్కడి యువతకు మెరుగైన ఉపాధులు అందరాదు.. అనే కుటిలత్వమే జగన్ తోను, ఆయన నీలిదళాలతోను ఇలాంటి పనులు చేయిస్తున్నదని వారు ఆరోరపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన మీడియా సంస్థలు, ఆయన తైనాతీలు అయిన వ్యక్తులు అందరి మీద ఉర్సా సంస్థ పరువు నష్టం దావా వేయడానికి సిద్ధమవుతోంది. సొంత డబ్బు ఒక్క పైసా కూడా పెట్టకుండా ఇతర సంస్థలను, కంపెనీలను బెదిరించి ప్రలోభ పెట్టి వారినుంచి తప్పుడు మార్గాల్లో నిధులు పుచ్చుకుని సొంత కంపెనీలు ప్రారంభించే జగన్మోహన్ రెడ్డికి.. నిజాయితీగా పనిచేసే.. యువత భవిత కోసం, రాష్ట్రం కోసం నిజాయితీగా సేవలందించే సంస్థలన్నీ తప్పుడు సంస్థలుగా కనిపించడంలో వింతేమీ  లేదని వారు ఆరోపిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles