ట్రైలర్‌ కూడా రాలేదు…కానీ విధ్వంసమా..!

Friday, December 5, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త సినిమా ఓజి పై అంచనాలు రోజు రోజుకు మరింతగా పెరుగుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు ట్రైలర్ రాకపోయినా అభిమానుల్లో ఉత్సాహం మాత్రం తగ్గడం లేదు. పైగా ట్రైలర్ విడుదలకు ముందే ఈ సినిమా మీద హైప్ గరిష్ట స్థాయికి చేరుకుంది.

ప్రత్యేకంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఓజి దుమ్మురేపుతోంది. ప్రీ సేల్స్ లోనే ఈ సినిమా 1.75 మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించింది. ఈ వేగం ఇలాగే కొనసాగితే ట్రైలర్ బయటకు వచ్చే లోపు 2 మిలియన్ డాలర్ల మార్క్ చేరుకోవడం ఖాయం అనిపిస్తోంది. అంతేకాకుండా థమన్ స్వరపరిచిన సంగీతం కూడా సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles