పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “హరిహర వీరమల్లు”. పవన్ కళ్యాణ్ కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కాగా దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ చిత్రం అనేక మార్లు వాయిదా పడుతూ వస్తుడడంతో ఒకింత అంచనాలు కూడా ముందు రేంజ్ లో ఇపుడు లేవు. ఇలా ఎట్టకేలకి ఈ సినిమా రిలీజ్ మార్చ్ నుంచి మే నెలకి షిఫ్ట్ కాగా ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు ఆల్రెడీ అలరించాయి.
ఇక ప్రస్తుతం ఈ సినిమా మూడో సాంగ్ పై లేటెస్ట్ బజ్ తెలుస్తుంlatది. దీని ప్రకారం ఈ ఏప్రిల్ 10న మూడో సాంగ్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే మే 9న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.