కాంతార 1 ట్రైలర్‌ కి ముహుర్తం కుదిరింది!

Tuesday, December 9, 2025

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ అంచనాలు క్రియేట్ చేసిన చిత్రాల్లో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తున్న కాంతార 1 కూడా ఒకటి. ఇప్పటికే విడుదలైన కాంతార ది లెజెండ్కి ఇది ప్రీక్వెల్‌గా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి మేకర్స్ తాజా అప్‌డేట్ ఇచ్చారు.

సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు కాంతార 1 థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఈసారి రిషబ్ శెట్టి ఏ విధమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తారో చూడాలంటే ట్రైలర్ వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles