టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు ఎంతో కాలంగా కష్టపడి రూపొందిస్తున్న భారీ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాపై సినీప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సౌత్ నుండి నార్త్ వరకూ పాన్ ఇండియా స్థాయిలో టాప్ స్టార్స్ భాగస్వామ్యం కావడం వల్ల ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను మహాభారతం సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉన్న సమయంలో, ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుందన్న సమాచారం ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపింది. అసలుగా ఈ ట్రైలర్ నిన్న విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. అయితే తాజాగా మంచు విష్ణు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
ఈ సినిమాను మల్టీస్టారర్‌గా ప్లాన్ చేయడం విశేషం. ఎందుకంటే ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం స్టీఫెన్ డేవెస్సి అందిస్తున్నారు. ఇక నిర్మాతగా మోహన్ బాబు స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు.
ఈ ఎపిక్ హిస్టారికల్ డ్రామాను జూన్ 27న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ విడుదల తరువాత మూవీపై హైప్ మరింత పెరిగే అవకాశముంది.
