ఆ స్టార్‌ హీరోకు యాక్సిడెంట్‌!

Saturday, January 10, 2026

తమిళ స్టార్‌ హీరో జీవా ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన చెన్నై నుంచి సేలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కారుకు  అడ్డుగా వచ్చిన బైక్ ని తప్పించడానికి ప్రయత్నించడంతో కారు ప్రమాదానికి గురై అక్కడున్న బారికేడ్ ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుంది. హీరో, అతని భార్య క్షేమంగా బయటపడినట్లు సమాచారం.

కన్నియమూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమిళ హీరో జీవా తెలుగులో రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తెలుగులో యాత్ర-2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాడు. అంతేకాకుండా 1983 ప్రపంచకప్‌ నేపథ్యంలో తెరకెక్కించి మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కూడా జీవా నటించాడు. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో నిమగ్నమయ్యాడు.

ఈ కారు ప్రమాదంలో  జీవాకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు అదృష్టవశాత్తూ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిన్నసేలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జీవా కుటుంబ సమేతంగా మరో కారులో సేలం బయల్దేరి  వెళ్లారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles