వేసవిలో సింగిల్ వచ్చేస్తుంది! టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సింగిల్అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి సంబంధించి ఓ మీమ్ పోస్ట్ ద్వారా ఈ చిత్ర రిలీజ్‌ను అనౌన్స్ చేశారు. ఈ మీమ్ పోస్టర్ చాలా ఫన్నీ అండ్ ట్రెండీగా ఉండటంతో ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.