టాలీవుడ్ నటుడు మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో చాలా మంది దిగ్గజ తారల కాంబోలో చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీనే “కన్నప్ప”. తన కెరీర్ డ్రీం ప్రాజెక్ట్ గా చేస్తున్న ఈ సినిమా ఈ ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ మేకర్స్ దీనిని వాయిదా వేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
అయితే కొత్త డేట్ ఏంటి అనేది రివీల్ చేయలేదు కానీ ఫైనల్ గా ఇపుడు దీనిపై అయితే ఓ క్లారిటీ వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని ఈ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. లేటెస్ట్ గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని మోహన్ బాబు సహా కన్నప్ప హీరో మంచు విష్ణు ఇతర ప్రముఖులు కలవగా ఇక్కడ నుంచి కొత్త డేట్ బయటకి వచ్చింది.
దీంతో కన్నప్ప జూన్ 27 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా మోహన్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ సహా కాజల్ తదితర భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.