పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పెద్ద సినిమాల్లో ఒకదానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రభాస్ లేని సన్నివేశాలను మేకర్స్ ప్లాన్ ప్రకారం షూట్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోని అగ్రనటుడు అనుపమ్ ఖేర్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు, ఆయన లుక్ కూడా ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా ఉండబోతుందని చెబుతున్నారు.
