మహావతార్‌ ని ప్రకటించిన హోంబాలే..!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులు తీసుకుంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న హొంబాలే ఫిలింస్ నుంచి ఇప్పుడు మరో భారీ ప్రకటన బయటకు వచ్చింది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’, ‘సలార్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను రూపొందించిన ఈ బ్యానర్ ఇప్పుడు మైథలాజికల్ నేపథ్యంలో ఓ విభిన్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ఇప్పుడే అధికారికంగా వెల్లడించిన ఈ ప్రాజెక్ట్ పేరు ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’. ఇది యాక్షన్‌తో పాటు మానవ విలువలను ప్రతిబింబించేలా దేవతల అవతారాల ఆధారంగా రూపొందించబోయే సిరీస్. ఇందులో మొత్తం 7 చిత్రాలు ఉండనున్నాయి. ప్రతీ సినిమా ఒక్కో విష్ణు అవతారంపై ఆధారపడి ఉంటుంది.

ఈ యూనివర్స్‌లో తొలి సినిమా ‘మహావతార్ నరసింహా’ పేరుతో తెరకెక్కుతోంది. దీనిని వచ్చే ఏడాది జూలై 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత వరుసగా ‘మహావతార్ పరశురామ్’, ‘మహావతార్ రఘునందన్’, ‘మహావతార్ ద్వారకాదీశ్’, ‘మహావతార్ గోకులనందన’, ‘మహావతార్ కల్కి పార్ట్ 1’, ‘మహావతార్ కల్కి పార్ట్ 2’ అనే సినిమాలు వచ్చే దశాబ్దం వరకు విడుదల కానున్నాయి.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సినిమాను రిలీజ్ చేయాలనే గ్యాప్‌తో ఈ సినిమాటిక్ యూనివర్స్‌ను చాలా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేకంగా క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి హొంబాలే ఫిలింస్ ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది.

ఇప్పటివరకూ మోడ్రన్ కమర్షియల్ సినిమాలకే పరిమితమైన హొంబాలే ఇప్పుడు పౌరాణిక నేపథ్యంలో ఎపిక్ స్థాయిలో సినిమాలు రూపొందించాలనుకోవడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్ట్ భారత సినిమా స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles