డైరెక్టర్‌ ని మార్చేసిన హీరో!

Monday, January 20, 2025

టాలీవుడ్‌ లో ప్రస్తుతం హిస్టారికల్, మైథాలజీ సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కొట్టాలంటే భాషలకు అతీతంగా ఆ జానర్ సినిమాలు తీయడమే మంచిదని మూవీ మేకర్స్‌ కూడా భావిస్తున్నారంట. డీజే టిల్లుతో సూపర్ సక్సెస్ ఫాంలో ఉన్న స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సైతం ఇప్పుడు ఓ మైథాలజీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న భారీ మైథాలజీ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే… ఆ వార్తల్లో నిజం లేదు. సిద్దు కొత్త సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి కాదంట.

‘క్షణం’ వంటి థ్రిల్లర్ తీసి హిట్ అందుకున్న రవికాంత్ పేరేపు డైరెక్షన్‌ లో లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అదే నిర్మాతలతో సిద్ధూ జొన్నలగడ్డ తీసే హ్యాట్రిక్ సినిమా ఇది. దసరా కానుకగా ఇవాళ లేదంటే రేపు ఈ సినిమాను ప్రకటించడానికి సిద్దమవుతున్నారంట. ఇప్పటి వరకు సిద్ధూ జొన్నలగడ్డ చేసిన సినిమాలు ఒక ఎత్తు… ఈ సినిమా మరో ఎత్తు అన్నట్లు ఉంటుందని సినీ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. సిద్ధు కెరీర్లో ఇప్పటి వరకు టచ్ చేయని జానర్, అటెంప్ట్ చేయని క్యారెక్టర్ చేయబోతున్నాడు.

మైథాలజీ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో మహారాజు పాత్రలో కనిపించబోతున్నారంట. ‘టిల్లు స్క్వేర్’ మూవీ సక్సెస్ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో అతిథి పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ మెరిశారు. అంతేకాకుండా ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ‘తెలుసు కదా’ సినిమాతో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమా కూడా చేస్తున్నారు. వీటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ చేసే ఆలోచనలో ఉన్నారు. ‘తెలుసు కదా’లో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles