రాష్ట్ర పర్యాటక ముఖచిత్రం మారనుంది!

Friday, January 17, 2025

వైఎస్ జగన్మోహన్ర రెడ్డి ముఖ్యమంత్రిగా రాజ్యం చేసిన అయిదు సంవత్సరాల కాలంలో.. రాష్ట్రంలో పరిపాలన అనేది పూర్తిగా స్తంభించి పోయింది. దాదాపు అన్ని రంగాలు కూడా కుదేలైపోయాయి. కేవలం ప్రజలకు డబ్బులు పంచిపెట్టడం ద్వారా ఓటుబ్యాంకును తయారుచేసుకోగలం అనే కుటిల బుద్ధి తప్ప.. జగన్మోహన్ రెడ్డి మరో రకంగా వ్యవహరించలేదు. ఆయన పాలనలో అయిదేళ్లపాటు సర్వనాశనం అయిన అనేక రంగాల్లో రాష్ట్ర పర్యాటక రంగం కూడా ఒకటి. ఆ రంగానికి వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి, పర్యాటక రంగం పరంగా ఆంధ్రప్దదేశ్ రాష్ట్ర వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పడానికి ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వం సరికొత్త టూరిజం పాలసీని కూడా విడుదల చేసింది.

జగన్ పాలన కాలంలో ఆ రంగాన్ని ఎంత ఘోరంగా దెబ్బ తీశారంటే.. అయిదేళ్లపాటూ టూరిజం శాఖ తరఫున తిరుమల దర్శనాల టికెట్లు ఇప్పించుకుని దళార్ల ద్వారా వాటిని బ్లాకులో అమ్ముకుంటూ బస్సులు నడపడం.. విశాఖలో రుషికొండకు గుండు కొట్టేసి.. అక్కడ జగన్ నివాసం కోసం 500 కోట్ల రూపాయలతో భవంతులను నిర్మించడం తప్ప వారు చేసిన పని మరొక్కటి లేదు. అలాంటి దుర్మార్గాలు  కాకుండా.. టూరిజం పరంగా ఎంతో అద్భుతమైన అవకాశాలు కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టిలో టూరిజం శాఖ ఒక కీలక భూమిక పోషించేలా కొత్త ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం ఉండడం విశేషం.

కొత్త పాలసీ ప్రకారం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో పర్యాటక ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతున్నారు. భూముల బదిలీలపై స్టాంపు డ్యూటీలు మినహాయించడం, పారిశ్రామిక విద్యుత్తు టారిఫ్ వర్తింపపేయడం, ప్రాజెక్టు ప్రారంభించినప్పటినుంచి అయిదేళ్లు విద్యుత్తు సుంకం మినహాయించడం, క్వాలిటీ సర్టిఫికేషన్ పై అవసరమైన రాయితీలు ఇవ్వడం, ఏడేళ్లపాటు జీఎస్టీ పూర్తిగా మినహాయించడం ఇలాంటి అనేక ప్రత్యేక వెసులుబాటులు కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
974 కిమీల తీరప్రాంతం ఉన్న ఏపీలో బీచ్ టూరిజం, నదుల్లో విహార యాత్రలు పెరిగేలా రివర్ క్రూయిజ్, ఎకోటూరిజం, స్పిరిచువల్ టూరిజం ఇలాంటి అనేక విధాలుగా టూరిజంను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles