విశాఖ వాసుల కలకు కార్యరూపం త్వరలోనే!

Friday, December 5, 2025

హైదరాబాదు నగరంలో మెట్రో రైలు వ్యవస్థ పూర్తయి రవాణా సేవలు ప్రారంభించడానికంటె ముందునుంచే విశాఖ నగరవాసులను మెట్రో అనేది ఊరిస్తూ వస్తోంది. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన తర్వాత.. విశాఖకు మెట్రో రైలు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా సుదీర్ఘమైన కసరత్తు చేశారు. ఆయన పాలన పూర్తయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబు శ్రీకారం దిద్దిన అనేక పనులను మంటగలిపేసినట్టే, విశాఖ మెట్రోపై కూడా జగన్ పగబట్టారు. కానీ.. మూడు రాజధానుల డ్రామా ప్రారంభించిన తర్వాత.. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అన్నారు గనుక.. అక్కడి మెట్రోపై అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా ప్రజలను భ్రమపెట్టారు. తీరా మళ్లీ చంద్రబాబు సర్కారు ఏర్పడిన తర్వాత మాత్రమే విశాఖ వాసుల స్వప్నం ఫలించే దిశగా అడుగులు పడుతున్నాయి. విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులను అక్టోబరులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామంటూ పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
విశాఖ మెట్రో డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డీపీఆర్ రూపొందించినట్టుగా కూడా మంత్రి నారాయణ ప్రకటించారు. విశాఖ మెట్రో విషయంలో తాను ప్రారంభించినా కూడా అసలు క్రెడిట్ చంద్రబాబునాయుడుకే దక్కుతుందనే ఉద్దేశంతో జగన్ కపటప్రేమను మాత్రమే ప్రదర్శించారు. చంద్రబాబు మాత్రం తిరిగి అధికారంలోకి రాగానే.. ఈ వ్యవహారాన్ని పరుగులు పెట్టించారు. విశాఖ మెట్రోతో పాటుగా అమరావతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు అయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేయించి కేంద్రం సముఖానికి పంపారు. కేంద్రంలోని ప్రభుత్వంలో కూడా రెండో అతిపెద్ద పార్టీ సారథిగా ఉన్న పరిచయాలను వాడుకుని.. రెండు నగరాల మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులను కూడా ఆయన సాధించుకు వచ్చారు.

మొత్తానికి విశాఖ వాసుల పదేళ్ల స్వప్నం.. మెట్రో రైలు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభిస్తోంది. అదికూడా హైదరాబాదు మెట్రో వ్యవస్థకు భిన్నంగా డబుల్ డెక్కర్ విధానంలో మరింత వినూత్నంగా రూపొందనుంది. ఈ పనులు అక్టోబరులో శ్రీకారం దిద్దుకోబోతున్నాయి.. అనే మాట వారిలో ఉత్సాహం నింపుతోంది.

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది ఏఫ్రిల్ నాటికి అందుబాటులోకి తెస్తాం అని ప్రకటిస్తున్నారు. ఈ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా 15 రోడ్లున కూడా త్వరిగతిన పూర్తిచేస్తాం అని ఆయన అంటున్నారు. మొత్తానికి రాబోయే ఏడాదిలోగా విశాఖపట్నం వైభవంలో రూపురేఖలు మారనున్నాయని అర్థమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles