అందుకే రానా గురించి దాచి ఉంచాం!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ యంగ్‌ నటుడు నవదీప్‌ సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్న సినిమా లవ్‌ మౌళి. ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు , ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కొంతకాలం క్రితమే సింగిల్‌ కట్‌ కూడా లేకుండా సెన్సార్‌ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఈరోజు విడుదల అవుతున్న సందర్భంగా నవదీప్‌ మీడియాతో ముచ్చటించారు.

 ఈ సినిమాలో ఒక అఘోరా పాత్రలో టాలీవుడ్‌ భల్లాలదేవుడు రానా నటించాడు. ఆ విషయం సినిమా రిలీజ్ అయ్యే వరకు అసలు బయటపెట్టలేదు చిత్ర బృందం. ఈ విషయం గురించి నవదీప్‌ ను మీడియా వారు ప్రశ్నించగా.. ఈ సినిమా గురించి స‌ర‌దాగా హీరో రానాకు క‌థ చెప్పాను. వెంటనే క‌థ బాగుంద‌ని చెప్పి ఈ సినిమాలో రానా అఘోరాగా ఓ ముఖ్య‌పాత్ర‌ను చేశాడు.

నిజంగా చెప్పాలంటే రానాకు ఈ పాత్ర చేయ‌డం అవ‌స‌రం లేదు. నాతో ఉన్న స్నేహంతో పాటు పాత్ర చేశాడు. ఈ రోజు వ‌ర‌కు కూడా రానా ఈ చిత్రం చేశాడ‌ని మేము ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే దీనిని క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకోవడం  మాకు ఇష్టం లేదు. ఈ సినిమాలో ఈ పాత్ర‌ను రానా చేయ‌క‌పోతే మా ద‌ర్శ‌కుడు చేసేవాడు అని  సరదాగా వ్యాఖ్యానించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles