అక్కినేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో నాగ చైతన్య ఇటీవల తండేల్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఇకపోతే, ఇటీవల నటి శోభిత ధూళిపాళతో అతని వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి ప్రేమ ఎలా మొదలైంది అనే ఆసక్తికర విషయాన్ని నాగ చైతన్య తాజాగా బయటపెట్టాడు.
జగపతిబాబు హోస్ట్ చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా లో పాల్గొన్న చైతన్య, తమ లవ్ జర్నీ గురించి చెప్పాడు. ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారానే శోభితతో పరిచయం మొదలైందని చెప్పాడు. తాను చేసిన ఒక పోస్ట్‌కు శోభిత రిప్లై ఇచ్చిందని, అక్కడినుంచి చాట్స్ మొదలై ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారిందని వివరించాడు.
ఈ లవ్ స్టోరీ గురించి అతను చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫ్యాన్స్ కూడా ఈ జంట కెమిస్ట్రీపై మంచి ఆసక్తి చూపుతున్నారు.
