నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన గత నాలుగు సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల తర్వాత ఇపుడు వస్తున్న మరో అవైటెడ్ భారీ సినిమానే “అఖండ 2” తాండవం. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ సీక్వెల్ పై పాన్ ఇండియా లెవెల్ హైప్ నెలకొంది.
ఇక దీనికి తగ్గట్టుగానే మేకర్స్ భారీ లెవెల్లో పార్ట్ 2 కి ఖర్చు కూడా చేస్తున్నారు. ఇలా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం అయితే మేకర్స్ మ్యాడ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ని పూర్తి చేసే పనిలో పడిందంట. చివరి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత నుంచి సినిమా ఎలా అందుకుందో అందరికీ తెలిసిందే.
దానికి ఎన్నో రెట్లు పవర్ఫుల్ గా ఉండేలా అఖండ 2 లో ఇంటర్వెల్ బ్యాంగ్ ని బోయపాటి తన మార్క్ మాస్ సీన్స్ తో తీర్చిదిద్దుతున్నరంట. అలాగే ఈ సీన్ కూడా డివోషనల్ టచ్ లోనే ఉంటుంది అని తెలుస్తుంది.