పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ అన్ని సినిమాల్లో కొన్ని ఇంకా చేయాల్సి ఉన్న ప్రాజెక్ట్ లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో చేయనున్న సినిమా కూడా ఒకటి. మరి ఈ చిత్రం పై రీసెంట్ గానే లుక్ టెస్ట్ కి ప్రభాస్ హాజరైనట్టుగా పలు రూమర్స్ వచ్చాయి.
అయితే ఈ లుక్ టెస్టులో ఇపుడు ప్రశాంత్ వర్మ ప్రభాస్ పై ఓ క్రేజీ లుక్ ని లాక్ చేసేసినట్టు తెలుస్తోంది. సో ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రభాస్ కొత్త లుక్ లో దర్శనం ఇవ్వనున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో బిజీగా ఉండగా ప్రశాంత్ వర్మ జై హనుమాన్, బాలయ్య వారసుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.