పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను మరోసారి దడదడలాడించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక దర్శకుడు మారుతి ఈ సినిమాను హార్రర్ కామెడీ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రం పై మంచి బజ్ అయితే క్రియేట్ అయ్యింది.
ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో వచ్చే సమ్మర్ సీజన్‌ను ప్రభాస్ బ్లాక్‌బస్టర్‌తో మొదలు పెడతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కానీ, తమిళ హీరో ధనుష్ మాత్రం ప్రభాస్‌తో పోటీకి వచ్చేందుకు రెడీ అయ్యాడు. ధనుష్ నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న తాజా సినిమా ‘ఇడ్లీ కడాయ్’ ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రంగా ఇది తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ అంటున్నారు.
ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా కూడా ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్లు వారు ప్రకటించారు
దీంతో ప్రభాస్‌తో పోటీకి ధనుష్ సిద్ధమయ్యాడని డార్లింగ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ, తమిళ ఆడియెన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న ధనుష్, తన సినిమాలోనూ మంచి కంటెంట్‌ను అందించకపోతే ‘ది రాజా సాబ్’ స్పీడుకు సైడ్ అవ్వాల్సిందే అని రెబల్ ఫ్యాన్స్ అంటున్నారు.