హిట్‌ 3 సినిమాలో సైకో కిల్లర్‌ గా ఆ స్టార్‌ హీరో!

Sunday, December 22, 2024

నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణంలో వచ్చిన హిట్‌ 1,2 ఏ రేంజ్‌ లో విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు ఈ మూవీ సీక్వేన్స్ గా హిట్‌ 3 కూడా రాబోతుంది. ఈ సినిమాలో ఈ సారి నాని హీరో కమ్‌ ప్రొడ్యూసర్‌ గా రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.

శైలేష్‌ కొలను ఈ సినిమాకి సంబంధించి ఓవార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. స్టార్‌ హీరో రానా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడంట. నాని దగ్గుబాటి రానాల ఫ్రెండ్‌ షిప్‌ గురించి అందరికీ తెలిసిందే. బావా బావా అంటూ పిలుచుకుంటూ ఓ అవార్డు వేడుకకు వ్యాఖ్యాతలుగా కూడా వ్యవహరించారు. అయితే ఇద్దరు కలిసి స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారీ. కాగా ఇప్పటికే డైరెక్టర్ శైలేష్ కొలను కథ కూడా రెడీ చేసినట్లు సమాచారం.

నాని కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాకపోతే సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్. సైకోలని పట్టుకోవడానికి హీరో రంగంలో దిగుతాడు. దీన్ని బట్టి చూస్తే హిట్ 3లో రానా సైకో కిల్లర్‌గా కనిపించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles