టాలీవుడ్‌లో కొన్ని కాంబోలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వారిలో దర్శకుడు హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబో కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘గబ్బర్‌సింగ్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే.
ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా కూడా రానుంది.‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు హరీష్ శంకర్ తీవ్రంగా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో షూటింగ్ జరుపుకోవడం కష్టమనే తెలుస్తుంది. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడనే టాక్ వినపడుతుంది.
నందమూరి బాలకృష్ణతో గత కొంత కాలంగా హరీష్ శంకర్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు.. ఆ మూవీ స్టోరీని ఆయన ఇప్పటికే సిద్దంగా పెట్టుకున్నట్లు..ఒక్కసారి బాలయ్యతో ఓకే అనిపించుకుంటే, పవన్ సినిమాను ప్రారంభించే లోపు బాలయ్యతో సినిమాను పూర్తి చేసేయాలని హరీష్ శంకర్ అనుకుంటున్నాడంట.
అటు పవన్ కళ్యాణ్ కూడా తాను నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, ‘ఓజి’ చిత్రాలను ముందుగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. దీంతో త్వరలోనే బాలయ్య-హరీష్ శంకర్‌ల కాంబో సిద్దం అయ్యే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది.