జగన్ దెబ్బకి ఆ ఎమ్మెల్యే చనిపోవాలని అనుకున్నాట్ట!

Saturday, January 18, 2025
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన అయిదేళ్లు కాలంలో.. ఆయన దెబ్బకు ఎంత మంది జీవితాలు సర్వనాశనం అయిపోయాయో.. ఇంకా లెక్క తేలలేదు. ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటికీ ఎంత అవస్థలు పడుతున్నారో మాత్రం చాలా మందికి తెలుసు. జగన్ స్వయంగా తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళితే.. ఆయన అనుచరులైన అక్కడి లోకల్ లీడర్లు కూడా చుట్టుముట్టి.. పాలన కాలంలో తమ బిల్లులు చెల్లించలేదని, ఇప్పుడు తమ గతి ఏంటని దాదాపు ఘెరావ్ చేసినంత పనిచేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సాక్షాత్తూ ఒక ఎమ్మెల్యేకు గతంలో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందిట. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వయంగా అసెంబ్లీలో తన మనోవేదనను క్షోభను వెళ్లబోసుకున్నారు.

2014-19 మధ్య కాలంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా బిల్లులు చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి వారిని అష్టకష్టాలకు గురిచేశారనేది అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వంలో కూడా విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగానే ఉన్నారు. అప్పట్లో పనులు చేశారు. ఆ తర్వాత జగన్ సర్కారు వచ్చింది. ఆ టర్మ్ లో ఆయన ఎమ్మెల్యేగా లేరు. ఆయనకు రావాల్సిన 87 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించకుండా జగన్మోహన్ రెడ్డి నిలిపేశారట. ఆ దెబ్బకు తనలాంటి వ్యక్తి పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని.. కానీ తనకు గుండెధైర్యం ఎక్కువ కాబట్టి ఇంకా బతికి ఉన్నానని ఆయన అసెంబ్లీలోనే చెప్పుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేసేసి, ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కాంట్రాక్టర్లను జగన్ చాలా ఇబ్బంది పెట్లారని ఆయన అన్నారు. బిల్లులు చెల్లించకపోయినా కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేశారని కూడా అన్నారు.
తమాషా ఏంటంటే.. జగన్ తన పరిపాలన కాలంలో.. తెలుగుదేశం రోజుల నాటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా వారి జీవితాలను శిథిలం చేసేశారు. అలాగని వైసీపీ హయాంలో పనులు చేసిన వారికైనా పద్ధతిగా బిల్లులు చెల్లించారా అంటే అది కూడా లేదు. తనకు కావాల్సిన, తనకు డొనేషన్లు ఇచ్చే పెద్దపెద్ద బడా కాంట్రాక్టర్లకు మాత్రం చెల్లింపులు జరిపారు. చిన్న చిన్న పనులు చేసిన వాళ్లకు చెల్లించకుండా ఆ భారాన్ని కొత్త ప్రభుత్వం మీదికి నెట్టేశారు. అలాంటి వారిలో ఎంత మందికి ఆత్మహత్య ఆలోచన కలుగుతున్నదో మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles