ఆ రకంగా సాక్షి పత్రికపై గొడ్డలి వేటు!

Thursday, November 21, 2024

సాక్షి పత్రిక పుట్టుకలో నిజాయితీలేదు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే జర్నలిజంయొక్క మౌలిక లక్ష్యం కూడా లేదు. ఆ పత్రిక పుట్టడమే అనుచిత, సంకుచిత లక్ష్యాలతో పుట్టింది. రాజశేఖర రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడం వారి ప్రాథమిక లక్ష్యం.

నిరంతరాయంగా రాజశేఖర రెడ్డి డప్పు కొట్టడం ద్వారా.. ఆయన మళ్లీ నెగ్గేలా చేయాలనుకున్నారు. అలాగే.. రామోజీరావు ఈనాడును దెబ్బకొట్టి.. సర్కులేషన్ లో వారి మార్కును అధిగమించడం అనేది పరమ లక్ష్యం. ఇలాంటి సంకుచిత ప్రయోజనాలతో ఏర్పడిన పత్రికను రాజశేఖర రెడ్డి మరణం తర్వాత.. అంతకంటె ఘోరంగా అచ్చంగా జగన్మోహన్ రెడ్డి కరపత్రంలాగానే నడుపుతూ వచ్చారు.

కరడుగట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు తప్ప మరొకరు ఆ పత్రికను చూడడానికి కూడా ఇష్టపడని రీతిలో పత్రికను తయారుచేశారు. అయితే సర్కులేషన్ విషయంలో ఈనాడును అధిగమిస్తున్నట్టుగా చూపించుకోవడానికి ఆ పత్రిక యాజమాన్యం కుయత్నాలు మాత్రం విడిచిపెట్టలేదు.

గతంలో అనేక నగరాల్లో  ఇంటింటికీ, దుకాణాలకు సాక్షి దినపత్రికను పేపర్ బాయ్ వేసేసేవారు. నెల గడిచిన తర్వాత చందా వసూలు చేసుకోవడం కోసం అసలు బాయ్ వచ్చేవారే కాదు. సాక్షి పత్రికను అత్యధిక కాపీలు ప్రింట్ చేయడం, కరపత్రాల్లాగా పంచిపెట్టడం మాత్రమే వారి లక్ష్యంగా ఉండేది. అలా ఉచితంగా వేస్తూ ఉన్నప్పటికీ కూడా జనం దానిని భరించలేక.. పేపర్ బాయ్ వచ్చే సమయానికి వేచి ఉండి.. అతడిని ఆపి బలవంతంగా పేపరు మాన్పించుకున్న ఉదంతాలు ఉన్నాయి.

అయితే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కసారిగా సాక్షి పత్రిక సర్కులేషన్ ను లక్షల్లో పెంచేసుకోవడానికి వారికి ఒక అడ్డదారి దొరికింది. రాష్ట్రంలోని 2.6 లక్షల మంది వాలంటీర్లు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు తెలుసుకోవడానికి ఓ పత్రిక కొనుక్కోవచ్చునంటూ జీవో తెచ్చి.. ప్రతి ఒక్కరికీ నెలకు రూ.200 ఇచ్చేలా నిర్ణయించారు. వారందరికీ బలవంతంగా సాక్షి సరఫరా చేశారు. ఒక్కసారిగా ఆ సర్కులేషన్ 2.6  లక్షలు పెంచేశారు.

అయితే ఇప్పుడు సాక్షి అడ్డదారి సర్కులేషన్ కు గొడ్డలి వేటు పడింది. వాలంటీర్లకు నెలకు పేపరు నిమిత్తం ఇచ్చే రూ.200 అలవెన్సును చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో ఒక్కసారిగా సాక్షి సర్కులేషన్ కూడా పడిపోయినట్టే. అడ్డదారుల్లో ఒకటో ర్యాంకుల్లోకి వెళ్లాలని కోరుకుంటే ఎప్పటికైనా పతనం తప్పదని.. నీట్ ర్యాంకర్లు మాత్రమే కాదు సాక్షి సర్కులేషన్ కూడా నిరూపించినట్లయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles