ఫిరాయింపు గతిలేని వారికి అదొక్కటే దారి

Sunday, June 23, 2024

ప్రస్తుతం ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో.. ఆ పార్టీ పరిస్థితే దుకాన్ బంద్ పొజిషన్ కు చేరుకున్నప్పుడు.. ఎవ్వరైనా సరే దానిని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని అనుకుంటారు.

చెరువు ఎండిపోయే పరిస్థితి చేపలు, కప్పలు ముందుగానే దొరువులు, డొంకల ద్వారా వేరే నీళ్లున్న చెరువులను వెతుక్కుంటూ వెళ్లిపోతాయని సామెత. రాజకీయ నాయకులు కూడా అంతే. అందుకే ఇప్పుడు దుకాన్ బంద్ పొజిషన్ లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేకొద్దీ తమకు ట్రబుల్సే తప్ప సేఫ్ కాదని గుర్తించిన చాలా మంది నాయకులు.. రాజీనామాలు చేస్తున్నారు.  తెలుగుదేశంలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తెదేపా కాకపోయినా.. ఏదో ఒక కూటమి పార్టీలో చేరుతారు. కానీ కొందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వారు ఫిరాయించినా సరే.. ఏ పార్టీలోనూ ఎంట్రీ దొరకని వాతావరణం ఉంటుంది. వారు ఏం చేయాలి? ఎక్కడా ఎంట్రీ దొరకదు గనుక.. నీళ్లు ఎండిపోతున్న చెరువులాంటి పార్టీలో ఉండలేరు కదా. అందుకే వారు ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు.

విజయవాడ ఎంపీగా తెలుగుదేశం  తరఫున రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. వైసీపీలో చేరారు. జగన్ తరఫున అయోధ్య రామిరెడ్డి రాయబారం నిర్వహించడం.. ఆయన చేరడం జరిగింది. విజయవాడ నుంచే వైసీపీ తరఫున ఎంపీగా పోటీచేసి దారుణంగా ఓడిపోయారు. ఆ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు, లోకేష్ లను దారుణంగా తిట్టారు నాని. తీరా ఇప్పుడు వైసీపీ పాతాళానికి పడిపోయి.. తెదేపా వైభవం మొదలైన తర్వాత.. ఆయన తిరిగి ఫిరాయించి తెలుగుదేశంలోకి వెళ్లడానికి కూడా అవకాశం లేనంతగా అప్పట్లో తిట్టారు. తెదేపా తరఫున ఆయన సొంత తమ్ముడు కేశినేని చిన్ని పోటీచేసి నెగ్గారు. నాని ఇక తెదేపా కాదు కదా.. వారిని తిట్టిన జోరు పుణ్యమా అని ఏ ఇతర పార్టీలోకి కూడా వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది.

వైసీపీలో ఉండే కొద్దీ ఆర్థికంగా చమురు వదిలించుకోవడం తప్ప ఇంకోటి జరగదని గ్రహించిన ఆయన జాగ్రత్త పడుతున్నారు. తాను రాజకీయ  సన్యాసం తీసుకుంటానని ప్రకటించేశారు. ఒక్క కేశినేని నాని మాత్రమే కాదు. వైసీపీ అధికారంలో ఉండగా చెలరేగిపోయి ఇతర పార్టీలను దారుణంగా తిట్టిన చిన్న సన్నా నాయకులు అందరికీ కూడా ఇప్పుడు రాజకీయ సన్యాసం ఒక్కటే కనిపిస్తున్న దారి అని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles