ఎన్నికల సమయంలో చోటుచేసుకునే స్పందన ఆవేశ కావేషాల నేపథ్యంలో ఎన్నికల తర్వాత కొన్ని నెలల పాటు చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉండడం చాలా సహజం. మారిన రాజకీయ పరిస్థితులలో పార్టీల మధ్య వైరం అనేది కార్యకర్తల మధ్య వ్యక్తిగత వైరం లాగా కూడా మారిపోతున్న రోజులలో ఇలాంటి ఘర్షణలు తప్పకుండా జరుగుతాయి. అదే మాదిరిగా ఇప్పుడు కూడా ఎన్నికల తర్వాత కొన్ని సునిశితమైన ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే వాటి నుంచి రాజకీయ అడ్వాంటేజీ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కుటిల ప్రయత్నం చేస్తున్నారనే వాదన ప్రజలలో వినిపిస్తోంది. నవాబుపేట ఘర్షణలో కొందరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిని పరామర్శించిన జగన్ రాష్ట్రంలో ఏకంగా రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ ను తెరమీదికి తీసుకురావడం వింతగా ఉంది.
ఎన్నికల తరువాత రాష్ట్రంలో 36 రాజకీయ హత్యలు జరిగాయని పదేపదే చెబుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి^ అధికార పార్టీ ఆ 36 మంది పేర్లు ఏమిటో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా నోరు విప్పడం లేదు. పైపెచ్చు ఇప్పుడు నంద్యాల జిల్లాలో జరిగిన హత్యను కూడా రాజకీయ హత్యగానే రంగు పులుముతున్నారు.
రంగు పులమడం అనేది రాజకీయాల్లో సహజం అలాంటి పనులు ద్వారా తమ పార్టీ మీద సానుభూతి వస్తుందని నాయకులు ఆశిస్తారు. అయితే దాన్ని సాకుగా చూపించి ఎన్నికలు పూర్తయి రెండు నెలలు కూడా గడవకముందే రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం అతిశయంగా కనిపిస్తోంది. గవర్నర్ ఈ విషయంలో చర్య తీసుకోవాలని జగన్ సలహా ఇస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకు వెళ్తాం అని బెదిరిస్తున్నారు.
రాష్ట్రంలో చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసిందిట. ఈ ప్రభుత్వం వద్దని ప్రజలంతా కోరుకుంటున్నారట. నిజానికి జగన్ కంటె ఆయన దత్తతండ్రి, దత్త సోదరుడు కేసీఆర్ మరియు కేటీఆర్ ద్వయం కాస్త నయం అనిపించేలా ఉన్నారు. ఎందుకంటే.. వారు రేవంత్ సర్కార్ ఏర్పడడాన్ని సహించలేకపోయినా.. వంద రోజుల దాకా ఆగుతాం అనే మాట వాడుతూ వచ్చారు. జగన్ రెడ్డి మాత్రం ప్రభుత్వానికి 55 రోజులు గడవకముందే రద్దుచేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని అంటున్నారు. జగన్ మనశ్శాంతిగా ఉండాలంటే బహుశా అదొక్కటే మార్గమేమో అని ప్రజలు అనుకుంటున్నారు.
జగన్ మనశ్శాంతికోసం అదొక్కటే మార్గమేమో!
Friday, December 27, 2024