సూపర్‌ స్టార్‌ మహేష్‌ కి జోడిగా ఆ బాలీవుడ్‌ బ్యూటీ!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ నటించిన గుంటూరు కారం తో ఈ ఏడాది థియేటర్లలో సందడి చేశాడు. సినిమా కూడా మంచి విజయమే సాధించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇదిలా  ఉంటే మహేష్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా చేంజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ  న్యూస్ తెగ వైరలవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఈ భామ టాలీవుడ్ లో ఎన్టీఆర్ ,రాంచరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ భామ ఇప్పుడు మహేష్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసిందని ఓ వార్త బాగా వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles