కన్నప్పలో ఆ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌!

Sunday, December 22, 2024

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకి మహాభారతం సీరియల్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌, మాలీవుడ్‌ స్టార్‌ లు చాలా మంది నటిస్తున్నారు.

 పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ఈ సినిమాలో మంచు విష్ణు కన్నప్ప గా నటిస్తున్నారు . రీసెంట్‌గా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ నుమేకర్స్ రిలీజ్ చేసారు.మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంది..ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంను ఎక్కుపెడుతున్నట్లు చూపించారు . ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ , మోహన్‌లాల్‌ తో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు..దీనితో ఈ సినిమాపై భారీ గా అంచనాలు పెరిగాయి . తాజాగా మరో అగ్ర నటి ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించనున్నట్లు టాక్‌ నడుస్తుంది.

 కాగా దీనిపై చిత్ర బృందం  నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇంతకు ముందు విష్ణు, కాజల్ కలిసి మోసగాళ్లు అనే సినిమాలో కలిసి నటించారు.  తాజా సమాచారం ప్రకారం మేలో మొదలయ్యే తాజా షెడ్యూల్‌లో ప్రభాస్‌ జాయిన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles