థాంక్స్ టూ జగన్ : చంద్రబాబు పని ఈజీ!

Tuesday, January 14, 2025

వాలంటీర్ల విషయంలో చంద్రబాబునాయుడు పని చాలా ఈజీ అయిపోయింది. నిజం చెప్పాలంటే.. మాజీ ముఖ్యంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు కలిసి చాలా గొప్ప మేలు చేశారు. వారు ఎన్నికల ప్రచార సమయంలో చేసిన అతివేషాల పుణ్యమా అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు పని చాలా సులువు అయిపోయింది. నిజం చెప్పాలంటే.. చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా.. అలాగని ప్రభుత్వం మీద ఆర్థిక భారం పెంచకుండా.. అలాగని ఆయన మీద ఎవ్వరికీ అసంతృప్తి కలగకుండా పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకునే అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం వారు జగన్ దళానికి థాంక్స్ చెప్పుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తూ వారి వేతనం పదివేల రూపాయలకు పెంచుతానని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాలంటీర్ల సంఖ్యను సగానికి తగ్గించాలని కూడా అనుకుంటున్నారు. అలా సగానికి తగ్గించినట్లయితే.. ప్రస్తుతం 5వేలు ఉన్న వారి వేతనం 10 వేలు చేయడం వల్ల ప్రభుత్వం మీద ఎలాంటి భారం ఉండదు. కానీ వాలంటీర్లను తగ్గిస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని కొందరు అనుకోవచ్చు. ఆ భయం లేకుండా వైసీపీ ఓ మేలు చేసింది.
వాలంటీర్లతో తమకు వక్రప్రయోజనాలు దక్కుతాయని, వారిద్వారా డబ్బు పంపిణీ, వారిద్వారా పెన్షన్ లబ్ధిదార్ల ఓట్లు వేయించుకోవడం ఈజీ అని భావించింది వైసీపీ. వారిని పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచింది ఎన్నికల సంఘం. ప్రచారంలో పాల్గొంటే వేటు వేసింది. దాంతో వైసీపీ అభ్యర్థులు తామే స్వయంగా తమ పార్టీ కార్యకర్తలు, తమ తొత్తులు అయిన వాలంటీర్లతో రాజీనామాలు చేయించి.. తమ ప్రచారంలో వాడుకున్నారు. వారు పొందగల జీతాలను తామే చెల్లించారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ఉద్యోగం ఇస్తాం అని చెప్పారు. ఆ రకంగా సుమారు 70 వేల నుంచి లక్షమంది వరకు వాలంటీర్లు విధులనుంచి తప్పుకున్నారు. దీంతో వాలంటీర్ల సంఖ్యను సగానికి తగ్గించి, జీతాలు రెట్టింపు చేసి ఇవ్వాలనుకున్న చంద్రబాబు ఆలోచనకు అడ్డులేకుండాపోయింది. ఇప్పుడున్నవారిలో వైసీపీ వీర విధేయులు కొందరు తప్పుకున్నా సరే.. చంద్రబాబు  తన ప్రణాళిక చక్కగా అమలు చేయగలరు. అందుకే తెదేపా జగన్ దళానికి థాంక్స్ చెప్పాలని ప్రజలు నవ్వుకుంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles