టెన్షన్‌..టెన్షన్‌!

Thursday, December 26, 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక  హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దన భారీ పాన్ ఇండియా సీక్వెల్ మూవీ “పుష్ప 2” కోసం ఇపుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో తెలిసిన సంగతే.

మరి దీనిపై భారీ హైప్ నెలకొనగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ అయితే ఆ హైప్ ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమా విషయంలో ఓ టాక్ మళ్ళీ నడుస్తుంది.గతంలో పుష్ప పార్ట్ 1 విడుదల తేదీ  లో కూడా కంటెంట్ డెలివరీ పరంగా చాలా టెన్షన్ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే.

చివరి నిమిషంలో పలు చోట్ల షోస్ కూడా నిలిచిపోయాయి. అయితే ఈసారి పార్ట్ 2 కి ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అని టాక్ ఆ మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. సమయం ఎక్కువ తీసుకున్నారు కాబట్టి చివరి నిమిషం డిలే ఉండవు అన్నట్టుగా టాక్ వినపడుతుంది.

కానీ ఇపుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ పుష్ప టీం అదే టెన్షన్ లో కనపడుతుంది. చూస్తే రిలీజ్ డేట్ దగ్గరకి వచ్చేస్తుంది. ఓ పక్క మిగిలిన  షూట్ ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇలా ఆదరాబాదరాగా పనులు జరుగుతున్నట్టుగా సినీ వర్గాల్లో ఓ  టాక్ వినపడుతుంది.

సుకుమార్ అయితే మళ్ళీ అప్పట్లాగానే రేయింబవళ్లు కంటెంట్ ని ఫైనల్ చేసే పనిలో పడినట్లు తెలుస్తుంది. అందుకే మొన్న ట్రైలర్ లాంచ్ లో కూడా ఆయన కనపడలేదు. దీనితో మళ్ళీ ఇపుడు కోసం టెన్షన్ టెన్షన్ గానే పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles