టీడీపీ సోషల్ మీడియా మరింత యాక్టివ్ కావలసిన అవసరం ఉన్నదని ఆ పార్టీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పెట్టదలచుకున్న అబద్ధాలను ఆ పార్టీ సోషల్ మీడియా విచ్చలవిడిగా ప్రజల్లోకి తీసుకువెళుతుంది. టీడీపీ సోషల్ మీడియా తరఫున కౌంటర్లు ఇస్తున్నారు గానీ.. ఆ పనిని మరింత సమర్థంగా చేయాల్సి ఉన్నదని.. సీఎం వంటి అగ్రనాయకులు గుర్తించిన అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లలేకపోతున్నారనేది పలువురి అభిప్రాయం. టీడీపీ సోషల్ మీడియా మరింత బాగా పని చేయాల్సి ఉందని అంటున్నారు.
వైసీపీ వారి పాలన కాలంలో అంతా ఇంకొక తరహాలో ఉండేది. టీడీపీ, జనసేన నాయకులను తిట్టడం ఒక్కటే వారి లక్ష్యంగా సాగేది. బూతులు, అసభ్యపు రాతలతో చెలరేగి పోయేవారు. ఇప్పుడు అలాంటిది అవసరం లేదుగానీ.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంతో పాటు, వైసీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో కూడా మెరుగైన పాత్ర పోషించాలని శ్రేణులు కోరుకుంటున్నారు.
ఉదాహరణకు.. జగన్ నెల్లూరు పర్యటనకు రోప్ పార్టీ కావాలని అంటున్నారు. అందుకోసం ఏకంగా హై కోర్టులో దావా నడుపుతున్నారు. అసలు ఒక మామూలు ఎమ్మెల్యే అయిన జగన్ స్థాయికి రోప్ పార్టీ ఎందుకు వస్తుంది.. తలా తోకా లేకుండా ఆ డిమాండ్లు ఏమిటి అనే ప్రశ్నను ప్రజలందరిలో లేవనెత్తడంలో సోషల్ మీడియా విఫలం అవుతుంది.
అలాగే… జగన్ కారుతో తొక్కించి చంపిన సింగయ్య భార్య లూర్తు మేరీని జగన్ పిలిపించుకుని పది లక్షలు ఇచ్చిన తర్వాత ఆమె మాట మార్చింది. ఆమెను బెదిరించి అలా చేయించారని పుకారు ఉంది. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి డబ్బులతో తన మీద కేసు పెట్టిన వాళ్లను జగన్ కొంటున్నారని చాటిచెప్పాలి. ఇలా టీడీపీ సోషల్ మీడియా మరింత బాగా పనిచేయాలని నాయకులు కోరుకుంటున్నారు.
