మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ జైలు లో ఉన్న క్యాబినెట్ మాజీ సహచరుడు కాగానీ గోవర్ధన రెడ్డిని పరామర్శించాలని ఆయన కోరిక. కాకాని ద్వారా తన గురించిన రహస్యాలు ఏవి బయటకు రాకుండా హెచ్చరించాలనేది కూడా లోగుట్టు. అందుకోసం ఆయన నెల్లూరు పర్యటన ప్లాన్ చేసుకున్నారు. అయితే నెల్లూరులో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వైఎస్ఆర్సిపి నాయకులు మాత్రం హెలిపాడ్ అనుమతి ఇచ్చి తీరాల్సిందే అంటూ హైకోర్టును ఆశ్రయించి కేసులు నడుపుతున్నారు. నిజానికి జగన్ నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్ నుంచి నెల్లూరు పెద్ద దూరం ఎంతమాత్రమూ కాదు. కానీ ఆ పార్టీ నాయకులు హెలికాప్టర్ కోసం ఎందుకు అంత పట్టుపడుతున్నారు? దీని వెనుక ఒక మతలబు ఉంది అని విశ్వసనీయంగా తెలుస్తుంది.
తాడేపల్లి నుంచి నెల్లూరుకు కేవలం కొన్ని గంటల్లో రోడ్ మార్గంలోనే వెళ్ళిపోవచ్చు. చంద్రబాబు జమానాలో వేయించిన అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. అయితే జగన్ హెలికాప్టర్ లోనే వెళ్లాలని పార్టీ నాయకులు అంటున్నారు. కోరుకుంటున్నారు. ఎందుకంటే..
జగన్ రోడ్డు మార్గంలో వస్తే తమకు కష్టాలు తప్పవనేది వారి భయం. ఇప్పటికే నెల్లూరులో యాభై వేల మందిని సమీకరించడానికి జగన్ పురమాయించి స్థానిక నేతలపై ఒత్తిడి పెడుతున్నారు. ఆయన రోడ్ మార్గంలో వస్తె దారి పొడవునా జనసమీకరణ చేయాలని అడుగుతారు. ఒకవైపు లక్షల ఖర్చు దానికి తోడు నిబంధనల ఉల్లంఘనకు అదనంగా కేసులు తప్పవని నాయకులు భయపడుతున్నారు. ఆయన హెలికాప్టర్ లో వస్తేనే తమ కష్టాలు తొలగుతాయని ఆశిస్తున్నారు. చూడబోతే.. జగన్ మీద ప్రేమతో కాదు గానీ.. ఆయన పర్యటన ఆర్థికంగా తమ నడ్డి విరచకుండా ఉండాలంటే.. హెలికాప్టర్ బెటర్ అనుభవించి, వారు కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ టూర్లు సొంత పార్టీ నేతల్లోనూ వణుకు పుట్టిస్తున్నాయన్నమాట !