డబ్బింగ్‌ మొదలు పెట్టిన తరుణ్‌ భాస్కర్‌!

Thursday, September 12, 2024

దర్శకుడిగా తన సినిమాలతో టాలీవుడ్ యూత్ లో సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకున్న యంగ్‌ దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి అందరికీ తెలిసిందే. మరి తాను ఒక్క దర్శకుడు గానే కాకుండా నటుడుగా కూడా పలు సినిమాల్లో నటించి తనదైన మార్క్ ని సెట్ చేయగా ఇప్పుడు తాను నటిస్తున్న లేటెస్ట్ సినిమాపై తాజా అప్డేట్ ఒకటి బయటకి వచ్చింది.

మన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ హీరోయిన్ గా కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్‌ చేసుకుంది. మరి ఇంకా టైటిల్ ఖరారు చేసుకోని ఈ మూవీ డబ్బింగ్ పనుల్లోకి అయితే రెడీ అయిపోయింది. నేడు ముహూర్త కార్యక్రమాలతో ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలు పెట్టగా ఈ సినిమాలో బ్రహ్మానందం, బ్రహ్మాజీ, గోపరాజు, విజయ్, సురభి, ప్రభావతి ,, శివన్నారాయణ, గోపరాజు, విజయ్, సురభి, ప్రభావతి తదితరులు యాక్ట్‌ చేశారు. అలాగే ఈ చిత్రానికి సంగీతం జయ్ క్రిష్ అందిస్తుండగా ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ బ్యానర్ లపై సృజన్ యరబోలు , వివేక్ కృష్ణాని,సాధిక్ లు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles