సూర్య-46 చిత్రంలో లుక్‌ అదుర్స్‌!

Thursday, December 4, 2025

తమిళ స్టార్ హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం సినిమా యూనిట్‌లు వరుసగా కొత్త అప్డేట్స్‌ను అభిమానుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘కరుప్పు’ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌లో సూర్య పవర్‌ఫుల్ గెటప్‌లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉంటే సూర్య తన 46వ చిత్రంగా తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న మరో ప్రాజెక్ట్ నుంచి కూడా బర్త్‌డే స్పెషల్‌గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సూర్య లుక్ చాలా స్టైలిష్‌గా ఉండగా, కూల్ మేనరిజం‌తో కొత్త షేడ్స్‌లో కనిపిస్తున్నారు.ఈ సినిమా ద్వారా తమిళం మాత్రమే కాదు, తెలుగులోనూ మంచి మార్కెట్‌ను కొల్లగొట్టాలని సూర్య ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,  ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక సూర్య రెండు సినిమాల నుంచి వచ్చిన ఈ రెండు స్పెషల్ గ్లింప్సులు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌గా నిలిచాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles