మందిరగా వస్తున్న సన్నీ లియోన్‌!

Thursday, May 2, 2024

బాలీవుడ్‌ బోల్డ్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జిస్మ్‌ 2 సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తన అందం, నటనతో అందరిని ఆకట్టుకుంది. వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌ లో బిజీగా ఉంది.  సన్నీ హీరోయిన్‌ గా చేస్తూనే కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేసింది.

సన్నీ నటించిన బేబీ డాల్‌ అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పనసరం లేదు. ఆ పాపులారిటీ కారణంగా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. సన్నీ ఏదైనా సినిమాలో ఐటెం సాంగ్‌ చేస్తుందంటే ఆ సినిమా లెవలే వేరు. . ఈ భామకు వున్న భారీ క్రేజ్ కారణంగా బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలలో కూడా ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి.

ఈ భామ టాలీవుడ్‌ లోకి కరెంట్‌ తీగ అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది.  ఆ తరువాత సన్నీలియోన్‌ ‘పీఎస్‌వీ గరుడవేగ’,   ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం సన్నీలియోన్ ‘రంగీలా’, ‘వీరమదేవి’, ‘కొటేషన్ గ్యాంగ్‌’, ‘షీరో’, ‘కోకా కోలా’ మరియు ‘యుఐ’ వంటి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇదిలా సన్నీలియోన్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్.యువన్ డైరెక్షన్‌ లో  సన్నీ లియోన్ “మందిర” అనే సినిమా  చేస్తుంది. ఈ సినిమాను కొమ్మాలపాటి శ్రీధర్ సమ్పర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. జావేద్ రియాజ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .తాజాగా ఈ సినిమా నుంచి సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ మారింది .

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles