తండ్రిపై ప్రచారం గురించి సునీత దుఃఖం!

Sunday, December 22, 2024

తన తండ్రి వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చి అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని వివేకానంద రెడ్డి కూతురు సునీత కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రత్యేకించి అవినాష్ రెడ్డి, అంతకంటే ముఖ్యంగా సాక్షి టీవీ ఛానల్ చేస్తున్న విషప్రచారం గురించి సునీత తీవ్రస్థాయిలో ఆవేదన చెందారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలని సునీత అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. సిబిఐ విచారణలో అవినాష్ రెడ్డి పాత్ర బయల్పడిన నాటి నుంచి ఆమె అవినాష్ కు శిక్ష పడేలా చూడాలని అడుగుతున్నారు. అదే సమయంలో అవినాష్ రెడ్డి వైపు నుంచి వివేకానంద రెడ్డి వ్యక్తిత్వహననం  చేసేలాగా దుష్ప్రచారాలు కూడా ప్రారంభం అయ్యాయి. 

వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకున్నారని.. అప్పటినుంచి కూతురు సునీతతో ఆయనకు సంబంధాలు లేవని.. ఆస్తులు మొత్తం రెండో భార్య పిల్లలకు ఇచ్చేస్తారనే భయంతో సునీత ఆమె భర్త కలిసి హత్య చేయించారని అవినాష్ రెడ్డి చెప్పసాగారు. అర్థరహితంగా ఉన్న వాదనే అయినప్పటికీ.. గోబెల్స్ ప్రచారమే విజయవంతం అవుతుందని నమ్మిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జనాలు అదే మాట పదేపదే చెబుతూ.. సునీతను ఆమె భర్తను హంతకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 

ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం ఊపందుకున్న తర్వాత సునీత వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా వైసిపి దళాలు ప్రచారం చేయడం కూడా ఎక్కువైంది. సునీత మహానటి అంటూ సాక్షి టీవీ ఛానల్ లో ప్రత్యేక బులెటిన్ రూపొందించి ప్రసారం చేశారు. తన తండ్రిని స్వయంగా చంపిన దస్తగిరికి బెయిల్ రావడానికి ఆమె సహకరించారని ఒక నింద వేశారు. అప్రూవర్ గా మారడం వలన మాత్రమే బెయిల్ వచ్చిందని, అప్రూవల్ అయినంత మాత్రాన హంతకుడు కాకుండా పోయేది లేదని ఒకవైపు సునీత మొత్తుకుంటూ ఉన్నప్పటికీ కూడా.. దస్తగిరి కి ఆమె మద్దతు ఇస్తున్నట్లుగా పదేపదే అవినాష్ రెడ్డి గాని జగన్ గాని ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చి.. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా కుట్రపూరితమైన ప్రచారం చేస్తున్నారంటూ సునీత కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన చెందడం పలువురిని కలచివేస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles