కన్నడలో ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్ సినిమాల్లో సు ఫ్రమ్ సో కూడా ఒకటి. రాజ్ బి శెట్టి నిర్మించిన ఈ హారర్ కామెడీని జెపీ తుమినాడ్ దర్శకత్వంలో రూపొందించారు. ఇందులో షనీల్ గౌతమ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాడ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా కన్నడలో మంచి వసూళ్లు సాధించింది.
అయితే తెలుగులో రిలీజ్ చేసినప్పటికీ మన దగ్గర ఎక్కువగా రాణించలేకపోయింది. ఇప్పుడు మాత్రం ఈ సినిమా ఓటిటి లోకి వచ్చి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జియో హాట్ స్టార్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ప్రస్తుతం కన్నడతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
