స్టేజీ పై అదరగొట్టిన శ్రీవల్లి!

Wednesday, January 8, 2025

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ మేనియా నెలకొంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పెద్ద తెర మీద చూద్దామా అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబో మరోసారి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను మూవీ మేకర్స్‌  ప్రెస్టీజియస్‌గా నిర్వహిస్తున్నారు .

ఇందులో భాగంగా ముంబైలో గ్రాండ్ ప్రెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్, రష్మికతో పాటు చిత్ర నిర్మాతలు కూడా పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా రష్మిక స్టేజీపై ‘సూసేకి’ హిందీ వర్షన్ సాంగ్ ‘అంగారో’ పాటకు తనదైన గ్రేస్‌తో డ్యాన్స్ చేసి అభిమానులను కట్టిపడేసింది.

బ్లాక్ శారీ లో రష్మిక స్టేజీపై నిజంగానే ఫైర్ పుట్టించిందని అభిమానులు అంటున్నారు.ఇక పుష్ప-2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిచారు. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles