కేంద్ర మంత్రిని కలిసి అమరన్‌ బృందం!

Thursday, December 5, 2024

తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా బ్లాక్‌బస్టర్ సినిమా ‘అమరన్’ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుని సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ లైఫ్‌ని బేస్ చేసుకుని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి రూపొందించాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటించి అందరి మన్ననలు పొందింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా ‘అమరన్’ చిత్ర టీమ్ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్‌ను ప్రత్యేకంగా కలిశారు.

ఆయన ‘అమరన్’ టీమ్‌ను తమ సక్సెస్‌పై శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి నిజమైన హీరో చిత్రాలు ప్రేక్షకులకు మరిన్ని అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ‘అమరన్’ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమాను కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేయగా, బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ సాలిడ్ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles