మరో బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన శ్రీలీల!

Wednesday, September 18, 2024

యంగ్ అండ్‌ టాలెంటెడ్‌ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .’పెళ్ళి సందD’ సినిమాతో తెలుగు సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఆ సినిమాతోనే యూత్‌లో మంచి  క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత రవితేజతో నటించిన ‘ధమాకా’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  ఆ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టింది. శ్రీలీల డాన్స్ కు పిచ్చ క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో శ్రీలీల కు ఆఫర్లు వరుస కట్టాయి. కానీ శ్రీలీల కు బ్యాడ్‌ టైమ్‌ నడుస్తుంది.

ఆమె చేసిన వరుస సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. గతేడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్‌ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాలతో  శ్రీలీలకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. దీనితో శ్రీలీల కెరీర్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. అయితే ఈ ఏడాది ఆమె నటించిన గుంటూరు కారం సినిమా మంచి విజయ్ సాధించింది .కానీ ఈ సినిమాలో కూడా శ్రీలీల పాత్రకు పెద్దగా పేరు రాలేదు.

దీంతో కొద్దిరోజులు సినిమాలకు విరామం తీసుకుని చదువు పై దృష్టి పెట్టాలనుకుంది. టాలీవుడ్ లో ఈ భామకు ఆఫర్స్ తగ్గడంతో  ఇక ఈ భామకు ఆఫర్స్ రావని అంతా అనుకున్నారు. కానీ కోలీవుడ్ నుంచి ఈ భామకు వరుస ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరోస్ విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. తమిళ నటుడు కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles