సైఫ్‌ అలీ ఖాన్‌ కొడుకుతో శ్రీలీల!

Wednesday, January 8, 2025

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల  టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం తో శ్రీలీల ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక రీసెంట్‌గా ‘పుష్ప 2’ మూవీలో ‘కిస్సిక్’ అంటూ మెరిసిన శ్రీలీల ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. ఈ పాటలో అమ్మడి అందంతో పాటు ఆమె చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఓ రేంజ్‌ లో పడిపోయారు.

అయితే, ఇటీవల శ్రీలీల త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది అనే టాక్ బాగా వైరల్ గా మారింది. అయితే, తాజాగా ఈ టాక్‌ను కన్ఫర్మ్ చేస్తూ శ్రీలీల ముంబైలో ప్రత్యక్షమైంది. ప్రముఖ నిర్మాన సంస్థ మాడాక్ ఫిలింస్ ఆఫీస్‌లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో శ్రీలీల కనపడింది.

మాడాక్ ఆఫీసుకి వెళ్లి రావడంతో వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ సినిమా రావడం ఖాయమని బిటౌన్ మీడియా చెబుతోంది.మరి ఈ ఇద్దరి కాంబోలో మాడాక్ ఫిలింస్ బ్యానర్ నుంచి రాబోతున్న సినిమా ఏమై ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో శ్రీలీల అభిమానులు ఆమె బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles