స్పెషల్‌ కసరత్తులు!

Sunday, December 22, 2024

‘యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ ల పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే, వచ్చే వారం నుంచి ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయనున్నారంట.

అందుకోసం ఓ భారీ సెట్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ఎవరి పై సాగుతుంది ?, ఒకవేళ.. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ – హృతిక్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేస్తే మొత్తం సినిమాకే ఈ సాంగ్ మెయిన్ హైలైట్ అవుతుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందనడంలో సందేహం లేదు.  పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉండనుందని టాక్‌ . పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles